బిగ్ బాస్ సీజన్ 9 కి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్..!
on Apr 6, 2025

అలేఖ్య చిట్టి పికిల్స్ వరల్డ్ వైడ్ ఇష్యూలా మారిపోయింది. అనగనగ ఒక ముగ్గురు అక్కాచెల్లెళ్లు కాస్ట్లీ రేట్స్ తో పచ్చళ్ళు అమ్ముతున్నారు...ఇంత కాస్ట్లీనా అన్న లేడీస్ ని, జెంట్స్ ని కెరీర్ మీద ఫోకస్ చేయండి ముందు, నాలుగు ఇళ్లల్లో పాచి పనులు చేసి బతుక్కోండి..అప్పుడే మీ లాంటోళ్ళు పచ్చళ్ళు కొనుక్కోగలరు అనే రేంజ్ ఆ త్రి సిస్టర్స్ లో ఒక అమ్మాయి వదిలిన బూతు ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. వీటి మీద కథనాలు బాబోయ్ యూట్యూబ్ లో మూడొంతులు ఈ పచ్చళ్ళ మీదనే..అలాగే దీని ఫుల్ మీమ్స్ కూడా వచ్చాయి..మూవీ ప్రొమోషన్స్ లో కూడా ఈ సిస్టర్ బూతులనే బాగా వాడేస్తున్నారు. అంటే బంగారం కంటే ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ కాస్ట్లీ అనేది వాళ్ళు చెప్పుకున్నారు అదే విషయం బాగా ట్రెండింగ్ లో ఉందిప్పుడు.
ఇక ఇప్పుడు వీళ్లల్లో ఒకరు బిగ్ బోస్ కి వెళ్లే ఛాన్స్ ఉందంటూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి చెప్తున్నాడు. ఐనా బిగ్ బాస్ కి ఎం కావాలి కాంట్రవర్సీ కావాలి..వీళ్లకు ఆర్గానిక్ గా ఆ కాంట్రోవర్సి రేటింగ్ వచ్చేసింది. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో అలేఖ్య గారే రావొచ్చు...బిగ్ బాస్ లో ఫేస్ చేయనంత నెగటివిటీని వీళ్లకు వచ్చేసింది. బిగ్ బాస్ హైప్ కోసం ఇలాంటి వాళ్ళు రావాల్సిందే..వీళ్ళు వచ్చే ఛాన్స్ లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉప్పల్ బాలు కూడా బిగ్ బాస్ 9 కి వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. ఇక ఆదిరెడ్డి చెప్పిన మాటలకు నెటిజన్స్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. "బిగ్ బాస్ కి వెళ్తే అక్కడ ఎంత మందిని తిడుతుందో. రొయ్యల పచ్చడి తిని ప్రెగ్నెంట్ అవ్వడానికా. వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్తే టీవీని మ్యూట్ లో పెట్టుకుని చూడాలి. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



